Our Core Mission

Dignified Gosala for Cows

గావో విశ్వస్య మాతరః

విశ్వమంతటికి అమ్మ గోమాత

వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు గోవుకు అత్యున్నత స్థానం ఇచ్చాయి. గోవు ధర్మానికి, అహింసకు, కరుణకు ప్రతీక.

  • "గావో విశ్వస్య మాతరః" –

గోవులు జగత్తుకు తల్లులు అని వేద వాక్యం. గోవులో33 కోట్ల దేవతలు నివసిస్తారని మన విశ్వాసం.

అంతే కాదు, సనాతన ధర్మంలో యజ్ఞ యాగాదులు, హోమాలలో 'గోమాత'కు అత్యున్నతమైన స్థానం ఉంది. యజ్ఞ కుండంలో వేల్చే హవిస్సులలో ఆవు నెయ్యి (ఘృతం) అత్యంత ప్రధానమైనది. ఇది అగ్నిని ప్రజ్వలింపజేసి, దేవతలకు ప్రీతిపాత్రమైన ఆహారాన్ని అందిస్తుంది.

అలాగే, యజ్ఞ సంకల్పానికి ముందు, యజ్ఞశాలను పవిత్రం చేయడానికి గోమయం (ఆవు పేడ)ను, గోమూత్రం (ఆవు మూత్రం) ఉపయోగిస్తారు. ఇవి ఆధ్యాత్మిక పవిత్రతతో పాటు, క్రిమిసంహారకాలుగా పనిచేస్తాయి.యజ్ఞంలో హోమగుండంలో వేసే మేడి, రావి వంటి పవిత్ర వృక్షాల సమిధలను, ఆవు పేడతో చేసిన పిడకలతోనే వెలిగిస్తారు.గోవు నెయ్యి అగ్నిలో కరగడం వల్ల విడుదలయ్యే పొగ, వాతావరణాన్ని శుద్ధి చేయడమే కాకుండా రేడియేషన్‌ను నిరోధిస్తుందని, ఆధునిక శాస్త్రవేత్తలు సైతం అంగీకరించారు.గో మూత్రం మొదలు గో క్షీరం (ఆవుపాలు) వరకు మనిషి ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పనిచేస్తాయి ...

అందుకే ..గోవులున్న ప్రదేశం ప్రాణవాయు నివాసం ,గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం .ఆవు పాలలో ఉన్నవి వేల ఔషధాల గుణం గోమూత్రం గోమయము సర్వ రోగ హరం..అంటారు.

గోస్తుతి

నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ ।జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ॥

ఈ ప్రసిద్ధమైన శ్లోకం శ్రీకృష్ణుడిని ప్రార్థించే అత్యంత శక్తివంతమైన మంత్రం. దీని అర్థం: బ్రాహ్మణులకు, వేదాలకు ఆరాధ్యుడైన దేవునికి నమస్కారం. గోవులకు, బ్రాహ్మణులకు (సజ్జనులకు) మేలు చేసేవాడికి నమస్కారం. సమస్త జగత్తుకు శ్రేయస్సును చేకూర్చే శ్రీకృష్ణునికి నమస్కారం. గోవిందుడైన ఆ భగవానునికి పదేపదే నమస్కరిస్తున్నాను... ఈ ఒక్క శ్లోకం సనాతన హిందూ ధర్మంలో గోమాతకు ఉన్న విశేష ప్రాధాన్యతను తెలియచేయడం మాత్రమే కాదు, గోపోషణ,గోసంరక్షణ ఆవశ్యకతను, కూడా తెలియచేస్తోంది.

నిజానికి పశు పక్షాదులను సైతం భగవత్ స్వరూపంగా ఆరాదించే, సనాతన హిందూ ధర్మం గోమాతకు ఇచ్చిన విశేష స్థానం గురించి, ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అవును, ఆవు (గోమాత)ను హైందవ ధర్మం మరో పశువుగా చూడదు. చూడలేదు, ముక్కోటి దేవతల నిలయంగా,సర్వ దేవత స్వరూపంగా ఆరాధించింది. వేదం కాలం నుంచి నేటి వరకు, అంటే మన ఋషుల మొదలు నేటి ప్రవచన కర్తల వరకు గోపూజ, గోసేవను అత్యంత పవిత్ర దైవ కార్యంగా పేర్కొన్నారు. సర్వ పుణ్యకార్యాలలో సర్వ శ్రేష్ట పుణ్య కార్యంగానూ పేర్కొనారు.గో సేవ,గో సంరక్ష మనందరి పవిత్ర కర్తవ్యంగా పేర్కొన్నారు.

అందుకే, ప్రముఖ ప్రవచన కర్త, పూజ్య గురువులు శ్రీ చాగంటి కోటేశ్వర రావు వంటి పెద్దలు, మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా, ముందుగా గోమాతను దర్శించుకోవాలని,గోప్రదక్షిణ, గోపూజ ఆచరించిన తర్వానే, దైవాన్ని దర్శించుకోవాలని అంటారు.

అంతే కాదు, ప్రతి రోజు గోవుకు గ్రాసం పెడితే, ప్రతి నిత్యం అగ్ని కార్యం చేసిన పుణ్య ఫలం దక్కుతుందని, పూజ్య గురుదేవులు అంటారు. అగ్ని కార్యం చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చును, కానీ, ప్రతి రోజు ఓ ఓ పిడికెడు పచ్చి గడ్డి లేదా ఎండు గడ్డిని గోవుకు పెడితే, దేవతలు,అగ్ని కార్యం చేయని దోషాన్ని పోగొట్టి, పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తారని పూజ్య గురుదేవులు తమ ప్రవచనాలలో పేర్కొన్నారు.

ముక్కోటి దేవతల కొలువైన దేవత స్వరూపం గోమాత రూపం. గోమాత దేహం పవిత్ర దేవాలయం. గోమాత శరీరంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు గోవుకు అత్యున్నత స్థానం ఇచ్చాయి. గోమాత మన ధర్మానికి, అహింసకు, కరుణకు ప్రతీక. అందుకే మన పెద్దలు, గోపూజ, గోసంరక్షణ, పోషణ హిందువుల పవిత్ర ధర్మంగా పేర్కొంటారు. మనమూ ఆడహ్ర్మ మార్గంలో ముందుకు సాగుదాం ..

గోమాతను పూజిద్దాం ... గోమాతను సేవిద్దాం ..!

కౌముది గోశాల ట్రస్ట్’

గో సేవే గోవింద సేవ

గో రక్షణే ధర్మ రక్షణ గోవులను రక్షిద్దాం…

సనాతన ధర్మాన్ని సంరక్షించుకుందాం !

సనాతన ధర్మం సకల దేవతా మూర్తిగా ఆరాదించే, గోమాతకు రక్షణ కరువైంది.గో సంరక్ష చట్టాలు ఎన్ని ఉన్నా,దేశ వ్యాప్తంగా గో సంరక్షణ ఉద్యమాలు సాగుతున్నా, గోమాతలను అక్రమ మార్గంలో కబేళాలకు తరలించే విషాద దృశ్యాలు ప్రతి నిత్యం దర్శనమిస్తూనే ఉన్నాయి. ఇదొక చేదు నిజం.విషాద వాస్తవం.

అందుకే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా, తిరుమల తిరుపతి దేవస్థానం మొదలు అనేక ధార్మిక స్వచ్చంద సేవాసంస్థలు ఏంతో కాలంగా గోసంరక్షణ, గోపోషణ లక్ష్యంగా సనాతన ధర్మ రక్షణ యజ్ఞాన్ని సాగిస్తున్నాయి. గోసేవే గోవిందుని ఆదేశంగా గోరక్షణే తక్షణ కర్తవ్యంగా సాగుతున్న ఈ మహా యజ్ఞంలో మా వంతు కర్తవ్యాన్ని నిర్వహింహేందుకు ‘కౌముది గోశాల ట్రస్ట్’ ముందు కొచ్చింది. ఇందులో భాగంగా కీసర మండలం, రాంపల్లి దాయర గ్రామం సమీపంలో, కౌముది గోశాలను స్థాపించింది. ఈ పవిత్ర కార్యంలో, ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుకుంటోంది. మీరు మేము మనమందరం ఒకటై, గోమాత సంరక్షణ, పోషణ కార్యాన్ని ముందుకు తీసుకు పోవాలని కౌముది గోశాల ట్రస్ట్’ కోరు కుంటోంది.. గో మాతను కాపాడుదాం .. మన ధర్మాన్ని రక్షిద్దాం.

ఇదే మనందరి నినాదం.ఇది మనందరి కర్తవ్యం.

ధర్మో రక్షిత రక్షితః ..

గోశాల ద్వారా సమాజానికి ప్రయోజనం ఆరోగ్యకరమైన జీవన విధానం పర్యావరణ పరిరక్షణ ధర్మ పరిరక్షణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం

గోశాల ద్వారా సమాజానికి ప్రయోజనం ఆరోగ్యకరమైన జీవన విధానం ,పర్యావరణ పరిరక్షణ, ధర్మ పరిరక్షణ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం